![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -16 లో... కన్నా, కేశవ ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి భూషణ్ ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక కన్‌స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో ఉంచుతారు. అప్పుడే అక్కడికి మాధవ వచ్చి ఏం చేస్తున్నారురా.. అసలు ఇలాంటి పని మీకు వాడు ఎందుకు అప్పజెప్పాడని మాధవ భయపడతాడు.
మరొకవైపు భూషణ్ పేరెంట్స్ భూషణ్ గురించి భయపడుతారు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రతాప్ అడుగుతాడు. ఎవరు లేరని వాళ్ళు చెప్తారు. మరి ఎవరు అతన్ని కిడ్నాప్ చేసినట్లు.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని భూషణ్ పేరెంట్స్ అనగానే వద్దని ప్రతాప్ అంటాడు. ఆది నువ్వు మన మనుషులని తీసుకొని వెళ్లి వెతికించమని ప్రతాప్ చెప్తాడు. మహా మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అదంతా చూసి చక్రి మురిసిపోతాడు. దూరం నుండి మహా, చక్రిని చూసి ఇదంతా చేసింది నువ్వేనా అని అడుగుతుంది. అవునండి అని చక్రి అనగానే మహా తనకి థాంక్స్ చెప్తుంది.
మరొకవైపు ఎవడ్రా మీరంతా.. ఏం కావాలో చెప్పండి ఇస్తాను నన్ను వదిలిపెట్టండి అని భూషణ్ అంటాడు. అయిన తన మాట ఎవరు లెక్కచేయ్యరు. చక్రికీ మాధవ ఫోన్ చేసి ఎందుకురా ఇలా చేస్తున్నావని అడుగుతాడు. మనం ఒక అమ్మాయికి సాయం చేస్తున్నామంతే అని చక్రి చెప్తాడు.
మరొకవైపు ఆది ఇంటికి తిరిగి వస్తాడు. భూషణ్ ఎక్కడ కనిపించలేదని చెప్తాడు. మీ వల్ల కాదంటే చెప్పండి అని భూషణ్ పేరెంట్స్ ప్రతాప్ తో అంటాడు. అప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అని చెప్పమని ఆదిత్యకి ప్రతాప్ చెప్తాడు. దాంతో మహా గదిలోకి వెళ్లి డాన్స్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చక్రి కిటికీలో నుండి చూస్తాడు.
తరువాయి భాగంలో ఇక పెళ్లి ఆపండి నాన్న అని మహా అనగానే నోరు ముయ్ మూడు రోజుల్లో అతనితో పెళ్లి చేస్తానని ప్రతాప్ చెప్తాడు. నువ్వు చేసిన పనికి పెళ్లి ఇంకా ముందుకి అయిందని చక్రితో మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |